ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖని శివారు ప్రాంతమైన గోదావరి నదిలో గురువారం ఉదయం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో జాలర్లు మృత దేహాలను బయటకు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన నజీముద్దీన్ గత రెండు రోజుల క్రితం గోదావరి నదిలో దుకడంతో వెంటనే జాలర్లు గాలింపు చర్యలు చేపట్టిన దొరకకలేదు. దీంతో 2 రోజుల తర్వాత మృతదేహం నీటిలో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ మృత దేహాన్ని బయటకు తీయడానికి జాలర్లు వెళ్లిన సమయంలో మరో మృత దేహం నీటిలో తెలియాడుతూ కనిపించించింది. వెంటనే జాలర్లు రెండు మృత దేహాలను బయటకు తీయగా మరో మృతుడు శివాజీ నగర్ కు చెందిన కొయ్యడ రాకేష్ గా గుర్తించారు. అయితే మరీ కొన్ని రోజుల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో గోదావరి నదిలో మృతదేహాలు లభ్యం కావడంతో అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. గతంలోనే ఆత్మహత్యలను నివారించేందుకు గోదావరి నది బ్రిడ్జి పై పెన్షింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన అధికారుల మాటలు కాగితాలకే పరిమితమయ్యాయని పలువురు మండిపడుతున్నారు. గోదావరి నది బ్రిడ్జి పై పెన్షింగ్ ఏర్పాటు చేయాలని గతంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..
Admin
Aakanksha News