ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ప్రజా ఉద్యమ నాయకుడు మాజీ కౌన్సిలర్ తన ఇంటి పేరుని సిపిఐగా మార్చుకొని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించిన మార్కపురి తిరుపతి 7వ వర్ధంతి సభ స్థానిక LB నగర్ లోని సీపీఐ జెండా వద్ద శాఖ కార్యదర్శి కామ్రేడ్ మార్కపురి సూర్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CPI జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ హాజరై తిరుపతి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ" ప్రజా ఉద్యమ నాయకుడు నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాడుతూ కమ్యూనిస్టు పార్టీ పక్షాన మొదటిసారి కౌన్సిలర్ గా ఎన్నికై ప్రజావాణిని కౌన్సిల్లో విన్నవించిన వ్యక్తి అని అనేక ప్రజా సమస్యలకు పోరాటాల ద్వారా పరిష్కారం చూపిన వ్యక్తి సిపిఐ తిరుపతిని కొనియాడారు. తన పేరు మార్కపూరి తిరుపతి అయినప్పటికీ తను చేసినటువంటి పోరాటాలతో పార్టీలో పనిచేసిన నిబద్ధతతో సిపిఐ తన ఇంటి పేరుగా మారి సిపిఐ తిరుపతిగా పేరెన్నిక పొంది రామగుండం కార్పొరేషన్ ప్రాంతంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ప్రజా ఉద్యమాల ద్వారా పొందారని వారన్నారు ఎల్బీనగర్ లో నిర్మించబోయే సిపిఐ తిరుపతి స్మారక భవన్ ఆ ప్రాంతంలో ప్రజలకు అండగా ఉద్యమాలకు నిలయంగా మారాలని వారి ఆకాంక్షించారు. ఎల్బీనగర్ లో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయడానికి ప్రజా ఉద్యమాలకు పరిష్కారం చూపించడానికి సిపిఐ తిరుపతి భవన్ ఒక నిలయంగా మారాలని దానికి పార్టీ కార్యకర్తలతో పాటు శ్రేయోభిలాషులు సానుభూతిపరులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి కామ్రేడ్ మార్కపురి సూర్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో CPI నాయకులూ గోగు మహేందర్, శ్రీనివాస్, సదుల శివ, రాజయ్య, రవి , తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News