ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : లక్ష యాభై వేల కోట్ల అప్పులు చేసి... ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే విద్యార్థినిలకు స్కూటీలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాసనమండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత స్కూటీలతో కలిసి విన్నత నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... మాట తప్పడం మడమ తిప్పడం కాంగ్రెస్ పార్టీ నైజం అని అన్ని వర్గాలను వంచించినట్లు విద్యార్థులను కూడా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. స్టేషన్ ఘన్పూర్ సభలో మేము ఇచ్చిన హామీలను అమలు చేయలేమని కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందన్నారు. డిగ్రీ ఆపై చదివే విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని ఇచ్చిన హామీలను మరొక్కసారి సమీక్షించుకోవాలని హితవు పలికారు. దేశంలో అనేక పార్టీలు అనేక హామీలను ఇస్తాయని కానీ చెప్పని హామీలను సైతం అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దే అని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. కెసిఆర్ ప్రభుత్వం అనేక సమస్యలను పరిష్కారం చేసి చూపించిందని మళ్లీ సమస్యలకు కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మారుస్తుందని విమర్శించారు
Admin
Aakanksha News