Thursday, 30 July 2026 04:00:29 PM

నా ప్రయాణం జీవితాంతం ఆయన తోనే.... ఎమ్మెల్యే మాణిక్ రావు

Date : 24 January 2024 02:40 PM Views : 518

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : నా ప్రయాణం... జీవితాంతం బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అని ఎమ్మెల్యే మాణిక్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసింది ప్రజా సమస్యల పరిష్కారం కోసమే అని దీనిని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టు పథకాలు జహీరాబాద్ కు మంజూరు చేశారని అన్నారు. ఈ లిఫ్ట్ పథకాలకు సంబంధించిన పనులను ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీంతోపాటు మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులను కూడా ఆపాలని చూస్తున్నారని వాటిని మంజూరు చేయాలన్నారు. దీంతోపాటు నా భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రితో చర్చించానని స్పష్టం చేశారు. నేను పుట్టింది బీఆర్ఎస్ లోనే చచ్చేది బీఆర్ఎస్ లోనే అని అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్త కథనాలను ఆయన ఖండించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :