ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖనిలో సకాలంలో ఓ మహిళా పేషేంట్ కు రక్తదానం చేసి... పలువురు యువకులకు ఆదర్శంగా నిలిచాడు. దూడపాక మల్లేష్ అనే వ్యాపారి. స్థానిక ఫైవింక్లైన్ కు చెందిన దూడపాక మల్లేష్, మాతంగి కాంప్లెక్స్ లో అప్నా బజార్ సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. పెద్దపల్లికి చెందిన ఓ మహిళ, స్థానిక లక్ష్మినగర్ లోని రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి ఉండడంతో, విషయం తెలిసిన సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి కే.ఎస్.వాసు వెంటనే మల్లేష్ కు సమాచారం ఇచ్చాడు. దింతో స్పందించిన మల్లేష్ అప్పటికప్పుడు ఆస్పత్రికి వెళ్లి స్వచ్చందంగా రక్తదానం చేశాడు. మల్లేష్ స్పందనకు అబ్బురపడిన రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కే.రాజేందర్, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు టి. శ్రవణ్ కుమార్, ప్రతినిధి వాసు, జాతీయ యువజన అవార్డు గ్రహీత, రామగుండం యువమిత్ర సేవా సమితి అధ్యక్షుడు ఈదునూరి శంకర్ తదితరులు రక్తదాతను అభినందించారు. ప్రతీ ఒక్కరూ రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు.
Admin
Aakanksha News