Friday, 31 July 2026 07:37:05 PM

సీనియర్ పాత్రికేయులు ఆర్. సత్యనారాయణ ఆకస్మికంగా మృతి...

Date : 26 January 2025 04:18 PM Views : 567

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సంగారెడ్డి జిల్లా : మాజీ ఎమ్మెల్సీ,సీనియర్ పాత్రికేయులు,ఆర్. సత్యనారాయణ ఆకస్మికంగా మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డికి చెందిన సత్యనారాయణ సీనియర్ పాత్రికేయుడిగా ఎన్నో సేవలను అందించారు. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. శాసన మండలి సభ్యులుగా కూడా సేవలు అందించారు. అయితే గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా అయన మృతి చెందడంపై బాధాకరమని పలువురు తమ సంతాపాన్ని తెలిపారు. సత్యనారాయణ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆర్.సత్యనారాయణ కుటుంబ సబ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :