Thursday, 30 July 2026 07:03:49 PM

కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ దిష్టిబొమ్మ దగ్ధం....

Date : 18 April 2025 12:13 PM Views : 673

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ అంజని కుమార్ యాదవ్ దిష్టిబొమ్మను బిజెపి నాయకులు అంబర్‌పేట తిలక్ నగర్ చౌరస్తాలో దగ్ధం చేశారు.. ఈ సందర్భంగా పలువురు బిజెపి నాయకులు మాట్లాడుతూ... గురువారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై అసభ్య పదజాలంతో అనుచిత వాక్యాలు చేయడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తను చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రెండు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆనంద్ గౌడ్, కార్పొరేటర్ వై. అమృత, నందకిషోర్ యాదవ్, వినోద్ యాదవ్, శ్యామ్ రాజు, మధు యాదవ్, యశ్వంత్, ఎంబీ కిషోర్, ప్రశాంత్ జోషి, వనం రమేష్, బల్వీర్, మైలారం రాజు, నాగభూషణ చారి, జ్యోతి, లక్ష్మణ్, సురేష్ యాదవ్, ప్రవీణ్, భాస్కర్ యాదవ్, క్షీర్ సాగర్, అరవింద్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :