ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఏ దేశమైనా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న మనిషి జన్మకు స్వార్ధకత పరిపూర్ణత చేకూరాలన్న విద్యా విజ్ఞానం ఎంతో అవసరం. ప్రస్తుత సమాజంలో విద్య లేనివాడు వింత పశువు అనే నానుడి ఉండనే ఉంది. సాంకేతిక రంగంలో ప్రగతి పథంలో అభివృద్ధి చెందాలన్న విద్య ఎంతో అవసరం. ఇలాంటి క్రమంలో గోదావరిఖనిలో ఓ కార్పొరేట్ పాఠశాల భారీ ప్రచారాలతో హంగు ఆర్భాటాలతో అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గోరంతలను కొండంత చేసి చూపిస్తూ పూర్తిస్థాయిలో ఎటువంటి అనుమతులు లేకుండానే విద్యాసంస్థలను నడిపిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ పాఠశాల పై ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సప్తగిరి కాలనీలోని ఒక కార్పొరేట్ పాఠశాల నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే సదురు పాఠశాలపై ఎన్నో ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సదురు పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆరా తీయగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో ఎన్టిపిసిలో నడిచిన సదరు పాఠశాల సప్తగిరి కాలనీకి మారింది. ఈ షిఫ్టింగ్ కు సంబంధించి సదురు పాఠశాలకు ఎటువంటి అనుమతులు రాకుండానే పాఠశాలను ఒకచోట నుంచి మరోచోటకు మార్చడంతో పాటు విద్యాశాఖ నియ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండానే ఎన్టిపిసి నుండి సప్తగిరి కాలనీకి మార్చి బిల్డింగ్ అనుమతులను సైతం తీసుకోకుండానే పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సదురు కార్పొరేట్ పాఠశాలకు సీబీఎస్ఈ పర్మిషన్ లేకపోయినా ఉన్నట్లు ప్రచారం చేసుకోవడంతో పాటు ఇతర జిల్లాల నుంచి విద్యార్థులను తీసుకువచ్చి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈనెల 19వ తేదీతో ముగియనున్న సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సదురు కార్పొరేట్ పాఠశాల సిద్దిపేట నుంచి కొంతమంది విద్యార్థులను తీసుకువచ్చి ఇక్కడ పరీక్షలు రాయిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సిద్దిపేటకు చెందిన విద్యార్థులకు ఇక్కడ సెంటర్ ఎలా కేటాయించారు...? ఏ పద్ధతిలో కేటాయించారు...? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంత జరుగుతున్న సంబంధిత విద్యాశాఖ అధికారులకు సమాచారం ఉందా లేదా అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. దీంట్లో ఓ విద్యాశాఖకు సంబంధించిన అధికారి పాత్ర సైతం ఉన్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే దీనిపై హైదరాబాద్ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో సోమవారం రోజు సదురు కార్పొరేట్ పాఠశాల బాగోతం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Admin
Aakanksha News