Friday, 31 July 2026 06:34:42 PM

మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Date : 17 August 2023 01:34 PM Views : 704

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం తహసిల్దార్ కార్యాలయం ముందు బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు సోమర అరుణ్ కుమార్, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, లు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి మోసం చేశారని ఆరోపించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్యం మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద లేదని అన్నారు. కెసిఆర్ అంటేనే ఒక అబద్ధమని తెలిపారు. దళితులకు మూడెకరాల భూమి, నాణ్యమైన కరెంటు, రైతులకు ఉచిత యూరియా, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి ఇలా ఎన్నో హామీలిచ్చి ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేశారని అన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రజల బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బిజెపి నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :