Saturday, 13 June 2026 02:40:28 PM

అధికార పార్టీకి ఝలక్

ఇండిపెండెంట్ అభ్యర్థిగా కందుల సంధ్యారాణి

Date : 21 September 2023 01:25 PM Views : 1175

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలో అధికార పార్టీకి పాలకుర్తి జడ్పిటిసి,బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కందుల సంధ్యారాణి ఝలక్ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై కొంత మంది అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని ఘాటుగా విమర్శించారు. తనకు ఉన్న క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రామగుండం ఆడబిడ్డగా ప్రజలు తనను ఆదరించాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :