Thursday, 30 July 2026 01:22:49 PM

ఓయు పరిపాలనా భవనానికి ముళ్ళ కంచెలు తొలగించాలి...

విద్యార్థులు ర్యాలీ.. అరెస్టు

Date : 14 December 2023 06:34 PM Views : 389

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద గురువారం విద్యార్థుల ఆందోళనకు దిగారు. ఓయూ లైబ్రరీ నుండి పరిపాలన భవనం వద్దకు విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా పరిపాలనా భవనానికి ఉన్న ముళ్ళ కంచెలు తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇకనైనా ఓయూ వీసీ నియంతృత్వ పాలన విడాలని డిమాండ్ చేశారు. కాగా.. పరిపాలన భవన్ లోకి వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్టు చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :