ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నడకను మించిన వ్యాయామం లేదని.. ప్రతిరోజు దినచర్యలో పది నిమిషాలు నడిస్తే వందేళ్ళ ఆయుష్షు మీ సొంతం అవుతుందని సామాజికవేత్త దేవి లక్మి నర్సయ్య అన్నారు. ఈ మేరకు గోదావరిఖనిలోని ఐఓసీ ఆధ్వర్యంలో శనివారం నాడువాకింగ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే నడకకు మించింది మరొకటి లేదన్నారు. నడక శరీరాన్ని చురుకుగా ఉంచుతుందని డాక్టర్ల నుంచి ఫిట్‌నెస్ నిపుణుల వరకు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలని సిఫార్సు చేస్తారని నడక అనేది మొత్తం శరీర కదలికను కలిగి ఉండే వ్యాయామని అన్ని అవయవాలు వేగంగా పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. రోజూ నడిస్తే మరే ఇతర వ్యాయామం అవసరం లేదని. ఏ వయసు వారైనా నడవవచ్చని అన్నారు. నడక బరువును అదుపులో ఉంచుతుందని దీంతో అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తుందన్నారు. నడక గుండెకు చాలా మేలు చేస్తుందని, నిత్యం నడిచే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ అని నడక వల్ల రక్తప్రసరణ పెరిగి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే నడక రక్తపోటును అదుపులో ఉంచుతుందన్నారు. రోజూ వాకింగ్ చేయడం ద్వారా శరీరానికి ఆక్సిజన్ పుష్కలంగా అందుతుందని. నడక ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం బాగా జరుగుతుందని తెలిపారు. ఈ కారణంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా ఉంటాయన్నారు. నడక ద్వారా జీర్ణవ్యవస్థ బాగా పని చేస్తుంది. పొట్ట శుభ్రంగా ఉంటుందన్నారు. ప్రతిరోజూ నడవడం ద్వారా బరువు తగ్గుతారని. నడక ద్వారా శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు తయారవుతాయని తెలిపారు. దీని కారణంగా మీరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. నడక మనస్సును పదును చేస్తుందని నడిచేటప్పుడు మెదడులో మార్పులు ఉంటాయన్నారు. ఇవి మెదడును ప్రభావితం చేస్తుందని. నడక మెదడు, నాడీ వ్యవస్థలో ఉండే హార్మోన్లను పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 10,000 అడుగులు అంటే 6 నుంచి 7 కిలోమీటర్లు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ ఓ సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News