ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని..ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని జాతీయ మానవ హక్కుల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎన్ హెచ్ ఆర్ సి బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసారు. కమీషన్ కూడా సానుకూలంగా స్పందించిందని ఈటల రాజేందర్ తెలిపారు.
Admin
Aakanksha News