Thursday, 30 July 2026 08:43:46 PM

200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీని అమలు...

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Date : 23 January 2024 05:22 PM Views : 639

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : వంద రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల ను నెరవేర్చుతామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం హామీల అమలుపై గాంధీ భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామన్నారు.వచ్చే నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ హామీని అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రెండు హామీలను అమలు చేశామని పేర్కొన్నారు. హామీల అమలుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతామని మంత్రి పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :