ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే... అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ను అమలు చేశారు. అయితే దీనిపై ఆటో డ్రైవర్లు పలు చోట్ల నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేడ్చల్లో ఆర్టీసీ బస్సుల్లో ఆటో డ్రైవర్లు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడంపై ఆటో డ్రైవర్లు నిరసనకు దిగారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో తమ బతుకు దెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News