Friday, 31 July 2026 02:38:50 PM

మీడియా ముసుగులో చీడపురుగు.....

గుప్త నిధులు మాయలు మంత్రాల పేరుతో ప్రజలకు శఠగోపం...

Date : 19 September 2024 03:45 PM Views : 605

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / ఆకాంక్ష డెస్క్ : నిజాన్ని నిర్భయంగా వాస్తవాన్ని వార్తగా మలిచి ఆలోచనను అలంకరిస్తూ అక్షర రూపం ఇవ్వడమే జర్నలిజం. అనునిత్యము యాంత్రిక జీవనం గడిపే నేటి సమాజ సభ్యుడికి సహజంగానే ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది. ఆ కోణం నుంచి మానవ సమాజాన్ని పరిగణించినట్లయితే ఇది అతి తక్కువ మంది మాత్రమే లోకంలో జరిగే సంఘటనలకు స్పందిస్తుంటారు.రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తే దీనిని చూడటానికి సైతం సమయం కేటాయించకుండా వెళ్లిపోయేవారు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉంటే గుమికూడి చర్చించే వారు పదుల సంఖ్యలో ఉంటారు. కానీ స్పందించి ప్రమాదం బారిన పడిన వారిని వైద్యశాలకు తరలించే వారు సంఘ సేవకుడు అయితే ఆ సంఘటనకు అక్షర రూపం ఇచ్చి లోకానికి అందించేవాడు జర్నలిస్ట్.ఒకప్పుడు ఏదైనా వార్త వస్తే ఎలా ఉంటుందో అని ఆలోచించే రోజులు కానీ ఇప్పుడు ఆ వార్తలను నీరుగారుస్తున్నారు. కలానికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. పాత్రికేయులపై దాడులకు దిగుతూ దుర్భాషలాడుతూన్నారు. నిజాలను చూపించే పాత్రికేయులపై అక్రమ కేసులు దాడులకు దిగుతున్నారు.అన్యాయాలు అక్రమాలు కుంభకోణాలు లక్షల రూపాయల గోల్ మాల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో సంఘటనలకు అక్షర రూపం దిద్ది ప్రజలకు తెలియజేసేదే జర్నలిజం. కానీ నేటి సమాజంలో నిజాలను రాసే జర్నలిజంలో చీడ పురుగులు చేరి మీడియా వ్యవస్థను తమ సొంతానికి వాడుకుంటూ అక్రమ సంపాదనకు అలవాటు పడుతున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ చైతన్యం కలిగించే విధంగా వ్యవహరించాల్సిన ఓ జర్నలిస్టు పక్క దారి పడుతు చైతన్యం కలిగించాల్సిన ప్రజలను మాయలు మంత్రాలతో మోసం చేస్తున్న తీరు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న ఓ జర్నలిస్టు ప్రజల క్షేమం కోరాల్సింది పోయి కొంత మంది నకిలీ అగోరాలతో చేతులు కలిపి గుప్త నిధుల, ఉద్యోగాల దందాల పేరుతో మాయలు మంత్రాలతో ప్రజలను మోసం చేస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇవే కాకుండా హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తిని తనను కోరుకున్న చోటుకు బదిలీ చేయిస్తానని చెప్పి తన వద్ద లక్షల రూపాయలు తీసుకొని ముఖం చాటేసాడనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇంతకీ ఎవరా జర్నలిస్టు...? తను చేసే అక్రమ తందాలేంటి...? ఉద్యోగాల పేరుతో ఎంత మందిని మోసం చేశాడు...? గుప్తనిధుల పేరుతో ఎంత మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు...? సంచలనమైన కథనం... అతి త్వరలో మీ ముందుకు మీ ఆకాంక్ష న్యూస్ లో....

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :