Thursday, 30 July 2026 02:44:14 PM

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై రంగంలోకి విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్...

Date : 17 January 2024 08:38 PM Views : 653

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఎస్పీ శ్రీనివాసులుతో కలిసి కాళేశ్వరం హరిత హోటల్‌లో ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.మేడిగడ్డతోపాటు కన్నెపల్లి పంప్ హౌస్ మునకకు కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీని విజిలెన్స్ ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. వారంతా రెండ్రోజులపాటు విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :