ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్న దాడుల నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ఆర్ ఎంపీ, పీఎంపీలు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంత్రి మల్లారెడ్డి ఇంటికి భారీగా చేరుకున్నారు. ఆరోగ్యశాఖ అధికారులు చేస్తున్న దాడులను ఆపివేయాలని వారు మంత్రి మాల్లారెడ్డిని కోరారు. అంతే కాకుండా తమకు భద్రత కల్పించాలని కోరారు. దీంతో స్పందించిన మంత్రి మల్లారెడ్డి ఆరోగ్యశాఖ మంత్రితో మాట్లాడి సమస్యల పరిష్కరిస్తానని వారికి తెలిపారు.
Admin
Aakanksha News