ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్నరా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడు అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నహాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజాశాంతి పార్టీ అధినేత కె ఏ పాల్ నేతృత్వంలో ప్రజా గాయకుడు గద్దర్ నేడు ప్రజాశాంతి పార్టీలో చేరి మునుగోడు నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే మునుగోడులో ప్రచారం చేయడానికి అన్ని రకాలుగా సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి రేపటి నుండి మునుగోడులో ఇంటింటికి వెళ్లి ప్రజా గాయకుడు గద్దర్ కలువనున్నట్లు తెలుస్తుంది.
Admin
Aakanksha News