Saturday, 13 June 2026 02:27:51 PM

కేటిఆర్ కు సీపీఐ (యంఎల్) ప్రజాపంధా బహిరంగ లేఖ

Date : 06 May 2023 02:01 PM Views : 479

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : సీపీఐ (యంఎల్) ప్రజాపంధా ఆధ్వర్యంలో గోదావరిఖనిలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పర్యటన నేపథ్యంలో ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని తగు సమీక్ష నిర్వహించి పరిష్కారానికై తగు ఆదేశాలు ఇవ్వాలని CPI ML ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా CPI ML ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ రామగుండం నియోజక వర్గం అధిక శాతం కార్మిక క్షేత్రంతో కూడిన నియోజక వర్గం అని ఇక్కడ సింగరేణి సంస్థ, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ సీ ఎల్, కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలలో అధిక శాతం కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్మిక వర్గమంతా కూడా అనేక సమస్యల్లో కొట్టు మిట్టాడుతున్న పరిస్థితి కూడా ఉందని ఈ నెల 8వ తేదీన రామగుండం నియోజక వర్గానికి వస్తున్న సందర్భంగా సమస్యల పరిష్కారం కోసం తగు సమీక్షలు నిర్వహిస్తారని పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తు సీపీఐ (యంఎల్) ప్రజాపంధా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటి బహిరంగ లేఖ ద్వారా విడుదల చేశారు. రామగుండం నియోజక వర్గ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ లేఖలో తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో సుమారు 25వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని. చాలీ చాలని వేతనాలతో, అరకొర సౌకర్యాలతో తమ కుటుంబాలను నేడు పోశించుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. వారు పర్మినెంటు కార్మికులతో సమానంగా పని చేసి సింగరేణి సంస్థకు కోట్ల లాభాలను సంపాదించడంలో కాంట్రాక్టు కార్మికుల చమట చుక్కలు ముడిపడి ఉన్నాయన్నారు. కాంట్రాక్టు కార్మికులు లేకుండా బొగ్గు ఉత్పత్తి వచ్చే అవకాశమే లేదని. అయినప్పటికినీ, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని సింగరేణి యాజమాన్యం ప్రదర్శిస్తున్నదని అన్నారు. కోల్ ఇండియ ఒప్పందాలు అమలు చేయక, కార్మిక చట్టాలు, చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయకుండా, జెబిసిసిఐలో కాంట్రాక్టు కార్మికులకు చేసిన ఒప్పందాన్ని అమలు చేయకుండా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోచుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైనా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలపై తమరు గతంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాల పెంపుపై ప్రకటన చేయాలని కోరారు.అలాగే రామగుండం నియోజక వర్గంలో అతి పెద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి అనేక జిల్లాలకు, రాష్ట్ర రాజధానికి సైతం నీటి కొరతను తీర్చిందని. కానీ, ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు, రైతు కూలీలకు మాత్రం న్యాయం జరగలేదన్నారు. నేటికి కొన్ని గ్రామాల ప్రజలకు ఆర్ అండ్ ఆర్ చెల్లించలేదని. ఇక్కడి నియోజక వర్గ ప్రజలకు తాగు, సాగునీటికై కేటాయింపులు జరగలేదని పేర్కొన్నారు. దీనిపై సమీక్ష చేయగలరని కోరారు. అంతే కాకుండా ప్రక్కనే గోదారి పారుతున్నా రామగుండం కార్పోరేషన్ ప్రజలు ఆ కలుషిత గోదావరి నీటిని త్రాగలేని దుస్థితి నెలకొన్నదని. శుద్ధి చేసిన నీటిని అందించలేని స్థితిలో రామగుండం కార్పోరేషన్ పాలకవర్గం ఉందని త్రాగడానికి వీలులేకుండా కేవలం చూడడానికి మాత్రమే ఉపయోగపడే విధంగా కాలేశ్వరం జలాలు ఉన్నాయని ఇప్పటికైనా రామగుండం కార్పోరేషన్ ప్రజలకు శుద్ధి చేసిన కాళేశ్వరం జలాలను అందించాలని వారు బహిరంగ లేఖలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) ప్రజా పంధా ఉమ్మడి జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణరెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు తోకల రమేష్,గుమ్మడి వెంకన్న, ఆడెపు శంకర్, కోడిపుంజుల లక్ష్మి,మార్త రాములు, పెండ్యాల రమేష్, గొల్లపెల్లి చంద్రయ్య,కట్ట తేజేశ్వర్, పి.సికిందర్ తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :