Thursday, 30 July 2026 01:15:56 PM

గొడవలకు దారి తీస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు..

ఎన్టీపీసీ ఎస్.ఐ.జీవన్

Date : 03 October 2022 05:11 PM Views : 477

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ బతుకమ్మ, దసరా పండగను ప్రశాంత, స్నేహపూరిత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని ఎన్టీపీసీ ఎస్ఐ జీవన్ పేర్కొన్నారు.సోమవారం ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో బంధు మిత్రులతో సంతోషగా అందరితో కలసి మెలసి పండుగను జరుపుకోవాలని కోరారు. అదే విధంగా బతుకమ్మ, జమ్మి పూజలు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని అన్నారు. దసరా రోజు అందరూ ప్రశాంతమైన వాతావరణంలో దసరా జరుపుకోవాలని అలా కాకుండా గొడవలకు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాసంక్షేమం కోసం మంచి ఉద్దేశ్యంతో పోలీసులకు సహకరించాలని ఎస్.ఐ జీవన్ ఒక్క ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా ఈరోజు బతుకమ్మ ఆట ఆడుతున్న క్రమంలో మహిళలు వారి నగలను, ఆభరణాలను, విలువైన వస్తువులను జాగ్రత్త గా ఉంచుకోవాలని సూచించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :