Thursday, 30 July 2026 04:23:05 PM

వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...

చెట్టును ఢీకొట్టిన కారు.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

Date : 04 March 2024 05:07 PM Views : 568

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మహబూబ్‌నగర్‌ జిల్లా : వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తకోట వద్ద జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. బళ్లారి నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. చనిపోయినవారిని వాసి(1), బుస్రా (2), మరియా (4), ఫాతిమా (50), అబ్దుల్ రెహమాన్ (30)గా గుర్తించారు. నిద్రమత్తు, అతివేగమే ప్రమాదమని కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :