Saturday, 13 June 2026 01:22:19 PM

దోచుకున్నందుకే విజయ రమణరావును ఓడించారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

Date : 03 October 2022 05:56 PM Views : 412

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : దోచుకున్నందుకే విజయ రమణరావును ఓడగొట్టి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీ అన్నారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...2009ఎన్నికల్లో ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తేనే నీ అరాచకాలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోయరని 2014,2018 ఎన్నికల్లో ఛీ కొట్టారని విమర్శించారు. మనోహర్ రెడ్డి అంటే ఏంటో ప్రజలకు తెలుసు కాబట్టి గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండోసారి గెలిపించారని అన్నారు.దోచుకోవడం దాచుకోవడం అలవాటు కాబట్టి అందరూ అలానే చేస్తారని అనుకుంటారని అసత్యపు ఆరోపణలు మానుకొని దమ్ముంటే సాక్షాదారాలతో నిరూపించాలని డిమాండ్ చేశారు.నియోజకవర్గ ప్రజలపై నిజమైన ప్రేమ ఉంటే రెండు రూపాయలకే ఇటుక అమ్మేలా పోరాటం చెయలేని అన్నారు. అంతే కాకుండా మద్దతిగా చదువు కోలేదు కాబట్టి సభ్యత సంస్కారం తెలియకుండా ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పవిత్రమైన ఓదెల మల్లన్న స్వామి దేవాలయాన్ని రాజకీయ వేదికగా మార్చాలనుకున్నావు. మల్లన్న ఎప్పటికీ నిన్ను క్షమించడని ఎమ్మెల్యే కావడం కోసం ఎంతటి నిచానికైనా దిగజారుతావని ప్రజలకు స్పష్టంగా తెలుసు ప్రమాణాలు చేయడం కాదు గుళ్లో పోచమ్మని కూడా ఎత్తుకొస్తావు అని విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే ఇసుక అమ్ముకున్నానని గుట్టలు తవ్వుకున్నానని నిరూపించు లేకపోతే జెండా కూడలిలో ముక్కు నేలకు రాసి చెప్పులు మెడలో వేసుకో, నీ లంచ గొండితనం,వక్ర బుద్ధి,అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడం ప్రజలందరికీ తెలిసిందే అని తప్పుడు మనిషివని రెండుసార్లు ఒడగొట్టారని దాసరి మనోహర్ రెడ్డీ ఘాటుగా వ్యాఖ్యానించారు. ముచ్చటగా మూడోసారి ప్రజలు ఓడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఎన్ని కారు కూతలు కూసినా ఎన్ని అబద్ధాలు ఆడిన ప్రజలు నిన్ను విశ్వసించారని భవిష్యత్తులో ఎన్నడూ ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వరని పేర్కొన్నారు.నీకు అధికారం ముఖ్యం నాకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం అని ఎమ్మెల్యే అన్నారు. తప్పుడు మాటలు మాట్లాడటం మానుకోకపోతే నాలుక కోస్తాం అని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీ తో పాటు ఎంపీపీ లు బండారి స్రవంతి-శ్రీనివాస్, బాలాజీ రావు, నూనెటి సంపత్, మోహన్ రావు, రమా- రాంగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, ఎ ఎం సి చైర్మెన్ బుర్ర శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి,ప్రేమ్ చందర్ రావు,పి ఎ సి ఎస్ ఛైర్మెన్ లు జూపల్లి సందీప్ రావు, గజవెల్లి పురుషోత్తం, పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :