Friday, 31 July 2026 01:19:49 PM

అసలేవరు....⁉️..నకిలీలేవరు..❓

మీడియా పేరుతో నకిలీల చెలామణీ...❓

Date : 04 April 2023 10:16 PM Views : 878

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : నిజాన్ని నిర్భయంగా వాస్తవాన్ని వార్తగా మలిచి ఆలోచనను అలంకరిస్తూ అక్షర రూపం ఇవ్వడమే జర్నలిజం. అనునిత్యము యాంత్రిక జీవనం గడిపే నేటి సమాజ సభ్యుడికి సహజంగానే ఆలోచన శక్తి సన్నగిల్లుతుంది. ఆ కోణం నుంచి మానవ సమాజాన్ని పరిగణించినట్లయితే ఇది అతి తక్కువ మందిలో మాత్రమే లోకం లో జరిగే సంఘటనలకు స్పందిస్తుంటారు.రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తే దీనిని చూడటానికి సైతం సమయం కేటాయించకుండా వెళ్లిపోయేవారు వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉంటే గుమికూడి చర్చించేవారు పదుల సంఖ్యలో ఉంటారు. కానీ స్పందించి ప్రమాదం బారిన పడిన వారిని వైద్యశాలకు తరలించేవారు సంఘ సేవకుడు. అయితే ఆ సంఘటనకు అక్షర రూపం ఇచ్చి లోకానికి అందించేవాడు జర్నలిస్ట్.నేటి జర్నలిజం ప్రశ్నార్థకంగా మారుతుంది... జర్నలిజం ఇప్పుడు జనాల వైపే ఆలోచిస్తూ జనం కోసమే పనిచేస్తుంది... ఇలాంటి జర్నలిజంలో అసలేవరో....⁉️..నకిలీలేవరో..❓ తెలియక సతమతమవ్వాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.. మీడియా పేరుతో ఎంతో మంది నకిలీలు రిపోర్టర్లుగా చలామణి అవుతూ ఇటు అధికారులను, అటు పాత్రికేయ వృత్తిని తప్పుదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తమ అవసరాలకు అనుగుణంగా మీడియా పేరును ఉపయోగించుకుంటూ కొందరు తమ వాహనాలపై ప్రెస్ అని స్టిక్కర్ వేయించుకొని బహిరంగంగా తిరుగుతున్నారు. సమాజంలో ఫోర్త్ స్టేట్ గా పిలవబడే మీడియా రంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ విలేకరులుగా చేలామణి అవుతున్నారు. మీడియా రంగంపై కనీస అవగాహన కూడా లేకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తప్పుడు వార్తలను సైతం ప్రచారం చేస్తూ గందరగోళ పరిస్థితులకు దారి తీస్తున్నారు.. ఈ మధ్య ఓ దినపత్రిక పేరుతో గతంలో నాయకుడిగా ఉన్న ఓ వ్యక్తి ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి 20 వేల రూపాయలను డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అంతే కాకుండా కొంత మంది మీడియా పేరుతో వసూల్లే లక్ష్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ఇదిలా ఉంటే కొంత మంది నకిలీలు ట్రాఫిక్ చలాన్ల కోసమో.. లేక పోలీసులు వాహనాలను ఆపకుండా ఉండడానికో వాహనాలపై ప్రెస్ అని స్టిక్కర్ వేసుకొని విలేకరులుగా ప్రచారం చేసుకుంటున్నారు.. ఇలాంటి వారిపై ఉన్నతాధికారులు కొరడా జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది... నోట్ : ఇది ఎవరినీ ఉద్దేశించి రాసినది కాదు...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :