Thursday, 30 July 2026 08:44:27 AM

సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపి క‌బురు...

సింగ‌రేణి కార్మికుల‌కు కోటి రూపాయాల ప్ర‌మాద భీమా...

Date : 24 January 2024 10:26 AM Views : 659

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశానికి వెలుగులు విరజింపుతున్న సింగరేణి కార్మికులకు త్వరలో తీపి క‌బురు అందనుంది. సింగ‌రేణి ఉద్యోగుల‌కు ప్ర‌మాద భీమాను భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సింగ‌రేణి కార్మికుల‌కు కోటి రూపాయాల ప్ర‌మాద భీమాను ఇచ్చేందుకు యూనియ‌న్ బ్యాంక్ అధికారులు అంగీక‌రించినట్లు సమాచారం.ఇప్పటి వరకు ఉద్యోగుల ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.కోటికి పెరగనుంది. యూబీఐలో అకౌంట్ కలిగిన ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు అంగీకరించారు. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :