ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : కొంత మంది తమ సొంత అవసరాల కోసం ప్రజలను అయోమయానికి గురి చేస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ బి సుమన్ రావు,రామగుండం తహశీల్దార్ జాహెద్ పాషా లు పేర్కొన్నారు.రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శివారులోని పీకే రామయ్య కాలనీలో సర్వే నం.617 లో శుక్రవారం రాత్రికి రాత్రే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా గుడిసెలు నిర్మించగా,విషయం తెలుసుకోని సంఘటన స్థలం కు చేరుకొని అక్రమ నిర్మాణాలను తొలగించారు.ఆ సర్వే నంబర్ లోనే ప్రభుత్వ భూమిలో 2007 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు పట్టలు కూడా పంపిణీ చేసిందని తెలిపారు. మిగతా ఖాళీగా ఉన్న సీలింగ్ భూమిలో ఏలాంటి నిర్మాణాలు చేపట్టిన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ సీలింగ్ భూమిలో రాత్రికి రాత్రే చొరబడడంతో పాటు అక్కడ సీపీఐ జెండాలు పార్టీ గుడిసె నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులను గుర్తించి అవసరమైతే బైండోవర్ చర్యలు చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కొంతమంది తమ లబ్దికోసం నిరుపేదలను పావులుగా వాడుకుంటూ ఇండ్ల స్థలాలు ఇప్పిస్తామని ఆశ చూపి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ సీలింగ్ భూమిలో చొరబడి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల చట్టరీత్యా చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు.
Admin
Aakanksha News