Thursday, 30 July 2026 07:55:11 PM

కేసీఆర్ భయపడే నాయకుడు కాదు..ఒక ఉద్యమ జ్వాల

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

Date : 25 April 2023 09:49 PM Views : 507

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సిద్దిపేట జిల్లా : కేసీఆర్ భయపడే నాయకుడు కాదని..ఒక ఉద్యమ జ్వాల అని బీఆర్ఎస్ పార్టీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడారు. ఈ సందర్భంగా సిద్ధిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజక వర్గ స్థాయి ప్రజా ప్రతినిధుల సభను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఈడీ, ఐటీ కేసులు పెడుతున్నారని.. మోదీకి తెలంగాణ మీద ప్రేమ లేదని విమర్శించారు.కేసీఆర్‌ను తిట్టడం కొందరికి ఫ్యాషన్‌గా మారిందని, కేసీఆర్‌ను తిట్టినంత మాత్రాన వాళ్లు పెద్దోళ్లు అయిపోరని అన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఎవరైనా నిర్మించారా?.. 24 గంటల కరెంట్ ఎవరైనా ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. ఈ సారి కూడా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :