Friday, 31 July 2026 02:38:40 PM

తెలంగాణ రావడంలో జైపాల్ రెడ్డిది కీలక పాత్ర...

తెలంగాణా మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు ఎల్.తాజ్ మోహన్ రెడ్డి

Date : 16 January 2024 08:10 PM Views : 776

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : దివంగత నేత జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌లో తెలంగాణా మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు ఎల్.తాజ్ మోహన్ రెడ్డి తో పాటు పలువురు నేతలు ఘనగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా తాజ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ రావడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. హైదరాబాద్ నగరానికి మెట్రో ట్రైన్ వచ్చిందంటే జైపాల్ రెడ్డి కృషి ఫలితమే అని పేర్కొన్నారు. జనతా పార్టీలో జైపాల్ రెడ్డి కొనసాగించినప్పుడు ఇక్కడ ఆయన చెదురని ముద్ర వేసుకున్నారన్నారు. తెలంగాణ బిల్లు పాస్ కావడానికి పార్లమెంట్‌లో జైపాల్ రెడ్డి చేసిన కృషి యావత్ తెలంగాణ ప్రజలు మరువరన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :