Friday, 31 July 2026 10:36:15 AM

మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు.. ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి

ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Date : 02 October 2024 04:18 PM Views : 505

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడ‌బొబ్బ‌లు దేనికి..? అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఆమెపై ఎవ‌రు మాట్లాడ‌లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు.ఇదే సోషల్ మీడియాలో మాపైన ట్రోలింగ్ పేరుతో దాడి జరగడం లేదా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. కొండా సురేఖ గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా..? ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలి. గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు పంపిస్తా మీకు కావాలంటే.. ఇదే కొండా సురేఖ హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని కామెంట్లు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? మాపైన అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడలేదా? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ మీకు, మంత్రులకు పంపిస్తా.. వెంటనే ముఖ్యమంత్రి నోటిని ఫినాయిల్ వేసి కొండా సురేఖ, మంత్రులు కలిసి కడగాలి అని కేటీఆర్ సూచించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :