Thursday, 30 July 2026 12:03:42 PM

3వ తరగతి విద్యార్థిపై విరిగిన బెత్తం...

గోదావరిఖనిలో ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వాకం..

Date : 21 March 2024 11:46 AM Views : 2494

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కొంతమంది టీచర్లు విద్యార్థులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆర్ ఎఫ్ సీ ఎల్ లోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఆరవ తరగతి విద్యార్థినిని చితకబాదిన ఘటన మరువకముందే మార్కండేయ కాలనీలోని మరొక కార్పొరేట్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఘర్షణపడి ఓ విద్యార్థిడికి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలు మరువకముందే ఎల్.బీ నగర్ లోని మరో ప్రైవేట్ పాఠశాలలో ఓ టీచర్ 3వ తరగతి విద్యార్థి మేకల పునీత్ ను చితకబడడంతో చేతులు వీపు పైన గాయాలయ్యాయి. దీంతో ఈ విషయాన్ని విద్యార్థి తన తల్లిదండ్రులకు చెప్పడంతో పాఠశాలకు వచ్చి యాజమాన్యాన్ని విద్యార్థి తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో విషయం తెలుసుకున్న NSUI విద్యార్థి సంఘం నాయకులు దుర్గాప్రసాద్ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. వెంటనే పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బాధ్యులైన విద్యాశాఖ అధికారులతో పాటు పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :