ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : మాగంటి సునీత కన్నీళ్లు పెడితే అది “డ్రామా, సీరియల్” అని వ్యాఖ్యానించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఇప్పటి వరకు ఈ వ్యాఖ్యలపై నోటీసులు ఇవ్వక పోవడాన్ని ఆయన ప్రశ్నించారు.మాగంటి సునీత మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, ఒక మహిళ కూడా. ఆమె ఆవేదన వ్యక్తం చేస్తే దానిని సీరియల్ అంటారా? ఇది సిగ్గుచేటు. మహిళల గౌరవం గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం. మహిళా కమిషన్ ఎక్కడుంది? ఎందుకు మౌనంగా ఉంది?” అని ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో మహిళా కమిషన్ చూపిన కఠిన వైఖరిని గుర్తు చేశారు.కేటీఆర్ బస్సులో మహిళలు ప్రయాణిస్తుంటే చేసిన కామెంట్‌పై కమిషన్ వెంటనే స్పందించింది. ఆయనను కమిషన్ ఎదుట హాజరు అయ్యే వరకు పట్టుబట్టింది. అయితే ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళను అవమానించే వ్యాఖ్య చేసినా ఎందుకు నిశ్శబ్దం? నోటీసులు ఇవ్వరా?” అని ప్రశ్నించారు.ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనేకమంది నెటిజన్లు కూడా మహిళా కమిషన్ స్పందన కోరుతున్నారు. రాజకీయ నాయకులు మహిళలపై వ్యాఖ్యానించే విషయంలో సమాన ప్రమాణాలు పాటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహిళా కమిషన్ తక్షణమే స్పందించి నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.రాజకీయ వర్గాల్లో ఈ ఘటన చర్చనీయాంశమైంది. మహిళా గౌరవంపై ఎప్పుడూ నినాదాలు చేసే నేతలే, ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Admin
Aakanksha News